చంద్రబాబు ఒక పెద్ద శాడిస్ట్.. కట్టలు తెంచుకున్న CM జగన్ కోపం

by GSrikanth |
చంద్రబాబు ఒక పెద్ద శాడిస్ట్.. కట్టలు తెంచుకున్న CM జగన్ కోపం
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్లలో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక పెద్ద శాడిస్టు అని మండిపడ్డారు. పేద విద్యార్థుల ఉన్నతి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియా పెడితే ఓర్వలేని శాడిస్టు, ఎస్సీ, ఎస్టీలను కించపరుస్తూ మాట్లాడిన శాడిస్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను అడ్డుకున్న దుర్మార్గుడు అని మండిపడ్డారు.

ఒకరికి మంచి జరుగుతుంటే చంద్రబాబుకు ఓర్చుకునే గుణం ఉండదు అని అన్నారు. పేదలకు స్థలాలు ఇవ్వకుండా కూడా అడ్డుకున్నారని చెప్పారు. 14 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.. కానీ, ఒక్క పథకం కూడా పేదల అభివృద్ధికి తీసుకురాలేక పోయారని విమర్శించారు. తాము మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలు నెరవేర్చామని తెలిపారు. పేదలకు సాయం చేసేవాడు కావాలో.. చేస్తుంటే ఓర్వలేక అడ్డుకునేవాడు కావాలో ప్రజలే నిర్ధారించుకోవాలని కోరారు. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed