- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మర్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు ఎన్నికలప్పుడు చెప్పిన పథకాలు కావన్నారు. 41,77,000 మంది మహిళలకు వైఎస్‌ఆర్ పెన్షన్ పథకం అందిస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం కింద 44,48,000 మంది మహిళలకు బెన్ ఫిట్ అయిందన్నారు.
సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ది చేకూరిందన్నారు. విద్యాదీవేన ద్వారా పెద్ద చదవులు ఫీజు రీయింబర్స్ చేస్తున్నామన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనపై చేసిన ఖర్చు రూ.13,351 కోట్లు అన్నారు. రాజకీయంగా మహిళల సాధికరత కోసం అనేక పథకాలు ప్రారంభించామన్నారు. ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాలో వేశాడా అని చంద్రబాబునుద్ధేశించి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఉండేవా అని ప్రశ్నించారు. సెల్ఫీ చాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు దిగడం కాదు చంద్రబాబు అన్నారు. దాచుకో, దోచుకో, పంచుకో అన్నది చంద్రబాబు నినాదమన్నారు.