Ap Politics:ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ఎమోషనల్ పోస్ట్..!

by Jakkula Mamatha |   ( Updated:2024-04-23 13:43:24.0  )
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అందించిన పథకాల్లో సింహభాగం మహిళలకు సంబంధించినవే ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. ఇంటి పట్టాలు సైతం మహిళల పేర్లతోనే రిజిస్టర్ చేశామని గుర్తు చేశారు. పథకాల ద్వారా ఇచ్చే నగదును కూడా నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు . ఇన్ని చేసిన తనకు రాఖీ కడతారా అంటూ సీఎం జగన్ మహిళలను కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మరోసారి వైసీపీని ఆదరించాలని కోరారు. ప్రజెంట్ సీఎం జగన్ ఎమోషనల్ పోస్టు వైరల్‌గా మారింది.

Advertisement

Next Story