- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రాత్రే పులివెందుకు సీఎం జగన్.. రేపటి కోసం పకడ్బందీ ఏర్పాట్లు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుండటంతో.. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రముఖులంతా సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ భార్య భారతితో కలిసి పులివెందులకు వెళ్లనున్నారు. మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈరోజు బయల్దేరనున్నారు. గత రెండు నెలలుగా ప్రజల మధ్య ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోని ప్రచారంతో ముగింపు పలికారు. ఈరోజు తాడేపల్లి నుంచి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నారు. ఓవైపు పోలింగ్.. మరోవైపు సీఎం వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ.
Read More..