సంస్కారం ఉన్నోళ్లైతేగా: పవన్ కల్యాణ్‌కు సీఎం జగన్ కౌంటర్

by Seetharam |   ( Updated:2023-07-21 07:05:18.0  )
YS Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : వలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. మంచి చేస్తున్న వలంటీర్ల పట్ల కొందరు సంస్కారం కోల్పోయి విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ వలంటీర్లపై ప్రసంగించారు. వలంటీర్లు ఎవరో కొత్తవారు కాదు..మనవాళ్లే. మనకు తెలిసిన వాళ్లేనని చెప్పుకొచ్చారు. ఎండైనా, వానైనా,చలైనా, పండుగైనా ఏ వాతావరణంలోనైనా అందరికీ అండగా ఉండేవాడు వలంటీర్ అని కొనియాడారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒకటో తేదినాడు డోరు కొట్టి పింఛన్ ఇచ్చే వాళ్లు వలంటీర్లు అని చెప్పుకొచ్చారు. అవినీతికి ఎక్కడా తావు లేకుండా..ఎలాంటి వివక్ష జరగకుండా ప్రతీ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు వలంటీర్లు అని చెప్పుకొచ్చారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, ఏ పార్టీ వాడు అని కూడా చూడకుండా ప్రభుత్వం అందించే సేవలను మీ ఇంటికి చేర్చే వలంటీర్ వ్యవస్థమీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవ్వాతాతలను సంతోషపెడుతున్న మన పిల్లల మీదే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. వలంటీర్లు అంటే మన గ్రామ పిల్లలే. మన వాళ్లే. మనందరికీ తెలిసిన వారేనని చెప్పుకొచ్చారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరు అని చెప్పుకొచ్చారు. వాలంటీర్ల పై తప్పుడు మాటలకు స్క్రీప్ట్ రామోజీరావుదే అని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.

Advertisement

Next Story