పవన్ కల్యాణ్‌కు సీఎం జగన్ కౌంటర్

by Rajesh |
పవన్ కల్యాణ్‌కు సీఎం జగన్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పార్వతీపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న అమ్మ ఒడి బటన్ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు జమ చేశారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ దాకా 83,15,341 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.

అమ్మ ఒడి ద్వారా ఇప్పటి వరకు రూ.26,067 కోట్లు జమ చేశామన్నారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా డబ్బు జమ చేశామన్నారు. క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితులను గతంలో చూశామన్నారు. ఇప్పుడు 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టోఫెల్ లో విజయం సాధించేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి నుంచి ట్యాబ్స్ ఇస్తున్నామన్నారు. పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు ఇప్పుడు పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ లా తయారు కావాలన్నారు.

బటన్ నొక్కడం అంటే ఏంటో తెలియని బడుద్దాయిలకు మనం ఏం చేస్తున్నామో చెప్పాలని పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. దత్తపుత్రుడిలాగా మనం బూతులు తిట్టలేమన్నారు. దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్ ఇప్పుడు ఒక లారీ ఎక్కడన్నారు. చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తానంటాడు అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. దత్తపుత్రుడిలాగా నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేమన్నారు. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలతో పోటీ పడే పరిస్థితి వచ్చిందన్నారు. వందశాతం పూర్తి రీ ఎంబర్స్ మెంట్ తో జగనన్న విద్యా దీవెన అమలు చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed