Breaking: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం జగన్.. సాక్షం ఇదే..

by Indraja |   ( Updated:2024-03-05 16:48:05.0  )
Breaking: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం జగన్.. సాక్షం ఇదే..
X

దిశ డైనమిక్ బ్యూరో: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ విఫలమైంది అని.. నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలి అని ఎన్నిసార్లు కోరిన ఏపీ ప్రభుత్వం స్పందించని పక్షంలో చలో సెక్రెటేరియేట్ కు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షర్మిల ర్యాలీ చేపట్టకుండా అప్రమత్తమైన ప్రభుత్వం విజయవాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర వందలాది పోలీసు బలగాలను మోహరించారు. ర్యాలీకి అనుమతులు లేవని, ఆఫీస్ చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేసి షర్మిలను హౌస్ అరెస్ట్ చేశారు.

కాగా మధ్యాహ్నం ఆఫీస్ బయటకు వచ్చిన వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తనని పోలీసులు అరెస్ట్ చేయడం పై ఆగ్రహానికి గురైన షర్మిల ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ అనే చేసిన పోస్టులో ఇలా రాశారు. వైసీపీ పార్టీ ప్రత్యేక రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని పేర్కొన్నారు. మీరు పూర్తి చేయని హామీలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా?.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నాకే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక రాచరికపు పాలన లో ఉన్నామా? అని పోస్టు ద్వారా నిలదీశారు. మెగా డీఎస్సీ కావాలి దగా డీఎస్సీ వద్దు అని ప్రభుత్వానికి రిప్రెజెంటేషన్ ఇద్దామని వెళ్తున్న నాతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి భౌతిక దాడికి పాల్పడి గాయపరచడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదు అది గుర్తు పెట్టుకోండి అని.. అలానే మన రాష్ట్రంలో ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ లేదని.. వినతి పత్రం తీసుకోవడానికి సచివాలయంలో ఒక్కరూ కూడా లేరట. సీఎం రాడు.. మంత్రులు లేరు.. అధికారులు రారు.. వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం అని పోస్టులో రాసారు.

Advertisement

Next Story