బంగాళాఖాతంలో 'మాండూస్'.. కలెక్టర్లకు CM YS Jagan కీలక ఆదేశాలు

by srinivas |   ( Updated:2022-12-08 11:20:58.0  )
బంగాళాఖాతంలో మాండూస్.. కలెక్టర్లకు CM YS Jagan కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన 'మాండూస్' తుఫాను దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి తుఫాను ప్రభావితమైన దక్షిణ కోస్తాతోపాటు ప్రభావిత జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం సీఎంఓ అధికారుల సమావేశంలో తుఫాను పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. తుఫాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయంగా నిలవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed