వారికి సమాధులు కట్టండి.. సీఎం జగన్ సంచలన పిలుపు

by srinivas |   ( Updated:2024-03-29 13:25:56.0  )
వారికి సమాధులు కట్టండి.. సీఎం జగన్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఇళ్ల స్థలాలు ఇస్తామని తాబు చెబితే.. వాటిని అడ్డుకునేందుకు ప్రతిక్షాలు తీవ్ర ప్రయత్నం చేశాయని.. వచ్చే ఎన్నికల్లో వారికి సమాధాలు కట్టందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల తోక కత్తిరిస్తామన్న చంద్రబాబు తోక కత్తిరించండని పిలుపునిచ్చారు. మైనార్టీ రిజర్వేషన్లు పణంగా పెడుతున్న పార్టీలను సమర్థిస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ఏపీలో నా అని పిలుచుకునే వర్గాలు లేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వర్గమంతా పక్క రాష్ట్రంలో ఉందని విమర్శించారు. ప్రభుత్వం బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెడతామంటే అడ్డుకున్నారని.. అటువారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు, మోసాలని సీఎం జగన్ ఎద్దేవా చేశారు

Read More..

విద్యారంగంలో మార్పులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story