ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయట ఉండాలి: సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-02-18 14:36:50.0  )
ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయట ఉండాలి: సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్ డెస్క్: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని.. సైకిల్ బయటే ఉండాలని, గ్లాసు సింకులో ఉండాలని సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు భరించలేక ప్రజలు ఐదేళ్ల కొందటే చొక్కా మడతపెట్టారని ఎద్దేవా చేశారు. మరోసారి చొక్కా మడతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. తమ హయాంలో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పారు. ప్రజలు ఒక్క చాన్స్ ఇస్తేనే చాలా మంచి పనులు చేశామని.. మళ్లీ ఆశీర్వదిస్తే మరెన్నో పనులు చేస్తామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

ప్రతి కుటుంబం భవిష్యత్ మంచిగా ఉండాలంటే 2024 ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలని సీఎం జగన్ పిలుపు నిచ్చారు. ఒకటి అసెంబ్లీకి అయితే.. మరోటి పార్లమెంట్ కని సీఎం జగన్ తెలిపారు. అప్పుడు ప్రజలకు చంద్రముఖి భయం ఇక ఉండదని విమర్శించారు. దుష్టతతుష్టయం బాణాలకు ప్రజలు బలికావొద్దన్నారు. తనకు ప్రజాబలం లేకపోతే చంద్రబాబుకు పొత్తులెందుకు అని సీఎం జగన్ ప్రశ్నించారు. సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు అని ఆయన నిలదీశారు. ప్రజలకు మంచి జరగాలంటే మళ్లీ తానే అధికారంలోకి రావాలని సీఎం జగన్ కోరుకున్నారు.

Read More..

చంద్రబాబును నమ్మొద్దు.. రాప్తాడు సిద్ధం సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story