56 నెలల మంచిని అడ్డుకున్నారు.. చంద్రబాబుపై సీఎం జగన్ ధ్వజం

by Disha Web Desk 16 |
56 నెలల మంచిని అడ్డుకున్నారు.. చంద్రబాబుపై సీఎం జగన్ ధ్వజం
X

దిశ, వెబ్ డెస్క్: 56 నెలలుగా పింఛన్లు ఇంటి వద్దనే అందించామని.. కానీ చంద్రబాబు అండ్ కో వాటిని అర్ధంతరంగా అడ్డుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కొనకమిట్లలో ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందన్నారు. అందుకే వాలంటీర్లు లేకుండా కుట్ర చేశారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అయినా.. సెలవు రోజు అయినా పింఛన్‌ను ఇంటి వద్దనే అందించామని చెప్పారు. నిమ్మగడ్డతో పెన్షన్ల పంపిణీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారని ధ్వజమెత్తారు. పింఛన్ దారులను మండే ఎండల్లో నడి రోడ్డుపై నిలబెట్టారని సీఎం జగన్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బందులకు గురి చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు.



Next Story