- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఓటమిని అంగీకరించిన జగన్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని రిజల్ట్స్ వెలువడ్డాయి. కళలో కూడా ఎవరూ ఊహించని అఖండ విజయం దిశగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూసుకుపోతుంది. అధికార వైసీపీ కేవలం తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమై ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇంత వరకు ఏ పార్టీ చవిచూడని ఘోర ఓటమిని మూట గట్టుకుంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తొలిసారి స్పందించారు. తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఓటమి అంగీకరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీలోని కీలక నేతలకు ఈ సందర్భంగా జగన్ విషెస్ తెలిపారు. ఇలాంటి ఫలితాలు వస్తాయని అస్సలు ఊహించలేదని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మంచి చేసినా ఓటమి పాలయ్యామని.. అయిన ప్రజల తీర్పును శిరస్సా వహిస్తానని స్పష్టం చేశారు. ఇక, ఎన్నికల్లో తనకు నిలబడ్డవారందరికీ జగన్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన గుండై ధైర్యంతో అడుకు ముందుకు వేస్తామని, ప్రతిపక్షంలో ఉండటం తమకు కొత్త కాదని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల కోసం పోరాటాలు చేయడమ మాకు కొత్తేమి కాదని స్పష్టం చేశారు.