ఢిల్లీలో సీఎం జగన్.. కాసేపట్లో కేంద్రమంత్రులను కలిసే ఛాన్స్

by srinivas |   ( Updated:2023-03-29 12:10:46.0  )
ఢిల్లీలో సీఎం జగన్.. కాసేపట్లో కేంద్రమంత్రులను కలిసే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాసేపట్లో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై వారికి సీఎం వివరించే అవకాశం ఉంది. మరోవైపు రెండు వారాల్లో కేంద్రపెద్దలను సీఎం జగన్ మరోసారి కలవడంపై ఆసక్తి నెలకొంది. కాగా పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర గవర్నర్ ను సీఎం కలిశారు. జీ-20 సదస్సు, బడ్జెట్‌పై వివరించారు. గవర్నర్ ను కలిసిన రోజుల్లోనే సీఎం ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story