- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం.. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు నాలుగో దశలో మే 13 పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇందులో భాగంగా ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చిలకలూరిపేట లో భారీ సభలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోసం స్వయంగా రంగంలోకి దిగిన జగన్.. బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను తాకుతు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని.. మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు మొత్తం 20 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని, 25 సభలలో సీఎం జగన్ పాల్గొంటారని.. వైసీపీ శ్రేణులు ప్రకటించారు. కాగా దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Read More..