CM Chandrababu:రేపు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన

by Jakkula Mamatha |
CM Chandrababu:రేపు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు(బుధవారం) చీరాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. తాజాగా సీఎం చంద్రబాబు పర్యటన వివరాలను సీఎంఓ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..జాండ్రపేట హై స్కూల్ గ్రౌండ్‌లో బుధవారం(ఆగస్టు 7) నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సభా ప్రాంగణాన్ని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ పరిశీలించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జాండ్రపేటకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ క్రమంలో రేపు సీఎం పర్యటన ఉండటంతో చీరాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story