‘AC గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు ఎలా తెలుస్తాయ్’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-03-01 10:20:34.0  )
‘AC గదుల్లో కూర్చుంటే  పేదల సమస్యలు ఎలా తెలుస్తాయ్’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(శనివారం) సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా(Chittoor District)లోని గంగధార నెల్లూరు(GD Nellore)లో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. గత వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర బాధలు పడ్డారని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయి కానీ.. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎన్డీయే కూటమిని గెలిపించారని వెల్లడించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటికెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు(Pensions) ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. దివ్యాంగుల పింఛన్లను రూ.6వేలకు పెంచాం, కిడ్నీ, తలసీమియా రోగులకు రూ.10 వేలు ఇస్తున్నాం. తీవ్ర వ్యాధులతో కదలలేని వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఏటా రూ.33 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కుటుంబ సంబంధాలు, విలువలకు మనదేశం ప్రపంచానికే ఆదర్శమని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed