TDP:‘సీఎం చంద్రబాబు జీవితం ఒక తెరిచిన పుస్తకం..మచ్చలేని మహనీయుడు’:టీడీపీ ఇన్చార్జ్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-01 11:39:13.0  )
TDP:‘సీఎం చంద్రబాబు జీవితం ఒక తెరిచిన పుస్తకం..మచ్చలేని మహనీయుడు’:టీడీపీ ఇన్చార్జ్
X

దిశ, మంత్రాలయం:టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు పురస్కరించుకుని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఎన్.రాఘవేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1995 సెప్టెంబర్ 1న మొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజు. అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది తెలిపారు. చంద్రబాబు నాయుడు ఒక విజినరీ నాయకుడు. తన లక్ష్యసాధన కోసం అహర్నిశలు కృషి చేసి దాన్ని సాధించడంలో అవసరమైన చాణక్యాన్ని ప్రదర్శించగలిగే అపర మేధావి, తన మేధాసంపత్తితో హైదరాబాద్ లాంటి చిన్న నగరాన్ని మహా నగరంగా తీర్చిదిద్దడంలో అతని పాత్ర అంతా ఇంతా కాదు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు పార్టీలో ఎదురైనప్పటికీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావుకి చేదోడువాదోడుగా ఉన్నారు.

నాదెండ్ల భాస్కరరావు కారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడినప్పటికీ పార్టీని పటిష్టంగా నిలపడంలో ఆయన ఎంతో కృషి చేశారని చెప్పాలి. చివరికి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యే సమయంలో సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు తలెత్తడం కారణంగా ధర్మ యుద్ధం చేయాల్సి వచ్చింది. తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో, ఆయన మాత్రం ప్రజాపక్షంగానే వ్యవహరించడం ఆయన నైతిక విలువకు నిదర్శనం. 70 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల యువకుడిలా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్య పోవాల్సిందే. రాష్ట్ర విభజన సమయంలో అప్పులు నెత్తిన పెట్టుకొని వచ్చినప్పుడు అమరావతిని రాజధాని చేయాలని దృఢ సంకల్పంతో రాజధానికి శంకుస్థాపన చేసి అభివృద్ధి పథంలో నడిపారు. దురదృష్టవశాత్తు గత ఐదేళ్లు ఒక అరాచక పాలకుని చేతిలో రాష్ట్ర ప్రజలు ఘోరంగా మోసపోవడం కారణంగా ఐదేళ్లు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేక అల్లాడిపోయింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి తీసుకెళ్లడానికి ఆహర్నిశలు నిద్రాహారాలు మాని పనిచేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.

అధికారంలో 15 సంవత్సరాలు అధికారం లేకుండా 15 సంవత్సరాలు, 30 ఏళ్లకే మంత్రిగా 45 ఏళ్లకే ముఖ్యమంత్రిగా, 74 ఏళ్లలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. సంక్షోభంలో కూడా సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి, అకాల వర్షం కారణంగా నియోజకవర్గ ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు, వరదలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ విషయానికి వస్తే తడిసిన కరెంట్ స్తంభాలు ముట్టుకోవడం, తడిసిన చేతులతో స్టార్టర్, మోటార్ ముట్టుకోవడం, ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోవడం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటాం, వర్షాభావ ప్రభావం ఇంకా ఉన్నందున నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా బయట ఎక్కువగా తిరగకుండా, సీజనల్ వ్యాధులకు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరుతున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ మొట్టమొదటి ముఖ్యమంత్రి విజయోత్సవాన్ని రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత అకాల వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ఘనంగా నిర్వహించలేక పోతున్నామని ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు విషయాన్ని గమనించుకొని వ్యవహరించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed