- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
CM: ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో.. సర్పంచ్ కూడా అంతే ముఖ్యం
దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ వ్యవస్థపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కోనసీమ జిల్లా వానపల్లిలో చంద్రబాబు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలన రాష్ట్రానికి చీకటి యుగం అని అన్నారు. ఆ ఐదేళ్లు గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. నరేగా నిధులు వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే పేదలకు న్యాయం జరిగేలా పాలన మొదలు పెట్టామని చెప్పారు.
జగన్‌కు రంగులు మార్చడం, బోర్డులు మార్చడం, పేర్లు మార్చడం మీద ఉన్న సోయి.. పేదల బతుకులు మార్చడం మీద లేదని మండిపడ్డారు. ప్రస్తుతం తాము నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్(సీసీ) రోడ్లు వేస్తామని కీలక ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక పెన్షన్లు పెంచిన ఘనత టీడీపీదే అని గుర్తుచేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో.. గ్రామానికి సర్పంచ్‌లు కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.