- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:‘తగిన వ్యక్తికి తగిన గౌరవం’.. నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిన్న(శనివారం) నామినేటెడ్ పదవుల(Nominated posts) రెండో జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు కూటమి నేతలు పదవులు పొందారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు.
పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పని చేయాలని స్పష్టం చేశారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. 30 వేల దరఖాస్తులు పరిశీలించి ‘తగిన వ్యక్తికి తగిన గౌరవం’ విధానంతో అవకాశం కల్పించామన్నారు. వేధింపులకు గురైన వారికి, మహిళలు, యువతకు, సమర్ధత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయని తెలిపారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎంపికలు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.