- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం పట్టింది.. విలువ తెలియని వ్యక్తులొస్తే ఇలాగే ఉంటుంది: చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 లో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాఫర్ డ్యామ్ గ్యాప్ గత ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణం చేసిన తొలిరోజే పనులు ఆపేశారని ధ్వజమెత్తారు. పోలవరం సైట్ నుంచి కాంట్రాక్టర్లను తరిమేశారన్నారు. రెండు సీజన్ల పాటు ప్రాజెక్టును పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. దిక్కులేని అనాధలాగా ప్రాజెక్టును వదిలేశారని చెప్పుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పైశాచిక ఆనందం పొందారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఊహించని నష్టం జరిగిందని మండిపడ్డారు. ఇక కేబినెట్‌లో 100 రోజుల తర్వాత మంత్రులకు ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్న సంగతి తెలిసిందే. అలాగే జనసేన మంత్రుల రిపోర్ట్ ను పవన్ కు అందజేస్తానని తెలిపారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి, నేడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు, భరోసా ఇస్తాయి. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ నోడ్స్ తో పాటు, పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద, రూ.12,000 కోట్లు ఇవ్వటానికి కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది.