- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu: రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేస్తే సహించం.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేస్తే ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన అసెంబ్లీ (Assembly)లో ఆయన మట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యంగా ఆడబిడ్డల భద్రత విషయంలో భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. ఇసుక పాలసీ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా.. సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే అవకాశమే లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రోజులు, గంటలు లెక్కబెట్టుకుని పని చేస్తున్నామని తెలిపారు.
అధికారంలో వచ్చిన 150 రోజుల్లోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం (YCP Government) వస్తుందేమోనని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టమని కూటమి ప్రభుత్వం వారికి పూర్తి భరోసాను ఇస్తుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని తెలిపారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.