- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్: హుటాహుటిన సింగ్‌నగర్‌కు సీఎం చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో టెంపుల్ సిటీ అతలాకుతలైంది. విజయవాడలో ఏ బస్తీలో చూసినా నీల్లే కనిపిస్తున్నాయి. ప్రతి రోడ్డూ చెరువును తలపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుడమేరు వాగు ఉప్పొంగి ఊరి మీద పడింది. దీంతో విజయవాడ సింగ్ నగర్‌లో ఇళ్లన్నీ నీటమునిగాయి. రోడ్లపై భుజాల వరకు నీళ్లు చేరాయి. దీంతో సింగ్ నగర్ వాసులు జలదిగ్బంధంలో చేరుకున్నారు. రోడ్డుపై వరద నీటిలో చాలామంది చిక్కుకున్నారు. అటు అధికార సహాయ చర్యలు అందిస్తోంది. వరద బాధితులకు లైవ్ జాకెట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
విజయవాడలో భారీ వర్షం, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా సమాచారం తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌ను సందర్శించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాసేపట్లో ఆయన సింగ్ నగర్‌కు బయల్దేరనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకోనున్నారు. సింగ్‌నగర్ కాలనీల్లో వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం వరద బాధితులను పరామర్శించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.