- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బద్వేల్ ఘటనపై స్పందించిన సీఎం.. మరోసారి ఇలాంటి సంఘటను జరగకుండా శిక్షించాలని ఆర్డర్
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా బద్వేల్‌లో బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించగా.. ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. కాగా ఈ ఘటనపై రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో "కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరం. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించాను. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే....హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమే. అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించాను. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించాను." రాసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై ప్రతిపక్షాలు సైతం తీవ్రస్థాయిలో స్పందించాయి. కూటమి ప్రభుత్వం హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటునే ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు.