మరికొద్ది క్షణాల్లో పోలవరానికి సీఎం చంద్రబాబు.. నేటి నుంచి జెట్ స్పీడుతో పనులు

by Mahesh |   ( Updated:2024-06-17 05:37:52.0  )
మరికొద్ది క్షణాల్లో పోలవరానికి సీఎం చంద్రబాబు.. నేటి నుంచి జెట్ స్పీడుతో పనులు
X

దిశ, వెబ్ డెస్క్: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ పార్టీ పోలవరం నిర్మాణంపై కొద్దిరోజులుగా యుద్ధం చేస్తుంది. కాగా తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం తో పాటు కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారి సీఎం హోదాలో ఆయన పోలవరంలో పర్యటించనున్నారు. మరికొద్దిసేపట్లో తాడేపల్లి నుంచి పోలవరం బయలు‌దేరనున్న సీఎం.. ప్రాజెక్టు నిర్మాణం స్టేటస్ ను స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే అధికారులు, ఇంజనీర్లతో సమావేశమై ప్రాజెక్ట్ స్థితిగతులపై పాయింట్ టు, పాయింట్ చెక్ చేయనున్నారు. అలాగే ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం ప్రాజెక్ట్ ను పరిశీలించిన తర్వాత అధికారులకు దిశ నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జెట్ స్పీడ్ లో ప్రాజెక్టు నిర్మాణ పూర్తవ్వాలని ఇప్పటికే అధికారులకు ఇంజనీర్లకు సూచించిన సీఎం.. ఇక పై ప్రతి సోమవారం .. పనుల పురోగతిపై స్వయంగా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story