AP Politics:పదవుల పంపకాల పై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొత్త ఫార్ములా..?

by Jakkula Mamatha |
AP Politics:పదవుల పంపకాల పై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొత్త ఫార్ములా..?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పదవుల కోలహలం జరుగుతుంది. రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా.. ఇప్పటికీ ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదు. రేపోమాపో అని సాగదీయటంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల భర్తీ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఫార్ములా సిద్దం చేసారు. పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై నిర్ణయానికి వచ్చారు.

టీడీపీ కూటమిలో నామినేటెడ్‌ పదవుల పంపకాలకు ఒక ఫార్ములా సిద్ధం చేశారు. టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బీజేపీకి 10 శాతం చొప్పున పదవులు పంపకాలు చేయాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో జనసేనకు 60 శాతం, టీడీపీకి 30 శాతం, BJPకి 10 శాతం చొప్పున, BJP గెలిచిన నియోజకవర్గాల్లో బీజేపీకి 60 శాతం, టీడీపీకి 30 శాతం, జనసేనకు 10 శాతం పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పదవుల భర్తీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed