- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు: సీఎం చంద్రబాబు నాయుడు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పుచ్చకాయలమడ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసిందని, సంవత్సరానికి లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. గత సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాను పూర్తిగా దోచుకొని పోయాడని మాజీ సీఎం జగన్ కొలంబియా స్మగ్లర్ ఎస్కోబార్ కు సమానుడని.. తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారని గుర్తు చేశారు.
గత ఎన్నికల్లో 21 మంది ఎంపీలను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ 21 మంది ఎంపీలు ప్రస్తుతం రాష్ట్రానికి సంజీవని అన్నారు. కేంద్రంలో పాలుపంచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నామని అన్నారు. అలాగే తాను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యానని, అప్పటి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలు మళ్లీ తనలో 1995 నాటి సీఎంను చూస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు.