- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Chandrababu: ఫెంగల్ తుపాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
దిశ, వెబ్ డెస్క్: ఏపీపై ఫెంగల్ తుపాను (Fengal Cyclone) ప్రభావం చూపుతుండటంతో.. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని, అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. తుపాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయన్న హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
వరదలు, భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. రైతులు ధాన్యం పై ఆందోళన చెందుతున్నారని, వారికి ఎప్పటికప్పుడు నిర్థిష్టమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
కలెక్టర్లతో మంత్రి గొట్టిపాటి కాన్ఫరెన్స్
తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలి, అల్లూరు, దగదర్తి, బోగోలు, విడవలూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, జలదంకి, చేజెర్ల, కందుకూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుమ్మలపెంట సముద్రతీరం వద్ద అలలు ఎగసి పడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రి గొట్టిపాటి రవి (Minister Gottipati Ravi) అప్రమత్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నాలుగు జిల్లాల్లో పరిస్థితుల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులను గొట్టిపాటి అప్రమత్తం చేశారు. వర్షా్ల్లో ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.