- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీపై రాజకీయం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: కేంద్రబడ్జెట్‌లో ఏపీకి ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాలకు సాయం చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఏపీకి సాయం చేయడం, కొన్ని రాష్ట్రాలకు మొండి చేయి చూపడంతో కేంద్రంపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు బడ్జెట్‌లా ఉందని మరికొంత మంది నాయకులు సెటైర్లు వేశారు. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనదైన స్ట్రైల్లో కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసిన సమయంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏదో ప్రత్యేకంగా ఇచ్చిందని కొందరు రాజకీయాలు చేస్తున్నారని, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీనే విభజన చట్టం రూపకల్పన చేసిన విషయం నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాల్లో ఏపీ చాలా వెనకబడి ఉందని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందన్నారు. పోలవరంలో కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలన్న ప్రతిపాదనలను, ఏపీ కేబినెట్ తీర్మాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.