ఆదాయార్జనశాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు

by srinivas |   ( Updated:2024-10-04 10:23:28.0  )
ఆదాయార్జనశాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆదాయార్జనశాఖల(Revenue Departments)పై అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం వస్తున్న ఆదాయంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆదాయంపై భారీగా దెబ్బపడిందని, ప్రస్తుతం రాష్ట్రంలో దెబ్బతిన్న ఆదాయాన్ని గాడిలో పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అందుకు ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. ఆదాయం పెరిగేలా రాష్ట్రంలో మంచి విధానాలు అమలు చేయాలని చంద్రబాబు తెలిపారు.

మరోవైపు జీఎస్టీ వసూళ్ల (GST Collections)పైనా అధికారులతో చంద్రబాబు చర్చించారు. గత ఏడాది, ప్రస్తుత వార్షిక సంవత్సరంలో వసూలు చేసిన జీఎస్టీపైనా ఆరా తీశారు. జీఎస్టీ ఎగవేతలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే క్లెయిమ్‌ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో వచ్చే ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి మెరుగైన పని తీరు కనబర్చాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.

Next Story