Good Governance: గుడ్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ వాయిదా.. కారణమిదే

by Rani Yarlagadda |
Good Governance: గుడ్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ వాయిదా.. కారణమిదే
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ (Good Governance) పై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరగాల్సిన సమావేశం వాయిదా పడినట్లు సీఎంఓ (CMO)వెల్లడించింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడిందని, తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుందో త్వరలోనే చెబుతామని సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (Teachers MLC By Election) కేంద్రం షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమైంది ఈసీ. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నవంబర్ 18 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 19న నామినేషన్లను పరిశీలిస్తారు. డిసెంబర్ 5న ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికల జరుగుతుంది. డిసెంబర్ 9న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.

Advertisement

Next Story

Most Viewed