AP:సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి

by Mamatha |
AP:సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పాలన పై దృష్టి పెట్టారు. దీంతో సమర్థులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై దృష్టిని సారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌, శాంతి భద్రతల అంశంలో సీనియర్‌ ఐపీఎస్‌ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు.

ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఇద్దరు కార్యదర్శుల కోసం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపాలని కేంద్రానికి సీఎం ఇటీవల లేఖ రాశారు. సీఎం చంద్రబాబు లేఖ పై స్పందించిన డీఓపీటీ, కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed