- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం రేవంత్ రెడ్డితో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ముఖ్యమంత్రి ఆసక్తికర ట్వీట్ ఇదే
దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 8న విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఉత్సవాలను ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణలోని పలువురు నేతలను స్వయంగా కలిసి మా నాన్న జయంతికి రండి అంటూ.. ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిను వైఎస్ షర్మిల కలిశారు. షర్మిల రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు శాలువ కప్పి ఒక మొక్కను బహుమతిగా ఇచ్చారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు’ అని ట్వీట్ పంచుకున్నారు. మరోవైపు షర్మిల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తన నివాసంలో కలిసి ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ నేతలను కలిసి ఆవ్వానించారు.