- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
CM Chandrababu: గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వం సీరియస్.. విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం అర్ధరాత్రి ఆలజడి రేగింది. లేడీస్ హాస్టల్‌లోని వాష్‌రూంలలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులంతా ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి విజయ్ ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడితో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై తక్షణమే విచారణ జరపాలని పోలీసు ఉన్నధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం సూచించారు.
- Tags
- Andhra Pradesh