CM Chandrababu:ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..మరో కార్యక్రమం ప్రకటించిన సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |
CM Chandrababu:ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..మరో కార్యక్రమం ప్రకటించిన సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మళ్లీ 1995 చంద్రబాబును చూస్తారని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తాను ఇంకా ఆ స్పీడ్ పెంచలేదని.. గతంలో తనతో పాటు మంత్రులు, అధికారులు పరిగెత్తే వారన్నారు. త్వరలోనే కచ్చితంగా 1995 చంద్రబాబును చూస్తారని పాలనలో దూకుడు పెంచుతామన్నారు. రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పెన్షన్ల పంపిణీలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకొని పేదరికం లేని సమాజం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రానికి సంబంధించిన 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నాం అని సీఎం తెలిపారు. 100 రోజుల టార్గెట్‌గా పనులు చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed