- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఆమెది అలాంటి క్యారెక్టర్’..మాజీ మంత్రి రోజాపై క్లాస్‌మేట్ సెన్సేషనల్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో గెలుపు పై ధీమాతో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ప్రస్తుతం వైసీపీ మాజీ మంత్రి రోజా గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారాయి. రోజా మొదటగా టీడీపీలో అడుగుపెట్టింది. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె అనూహ్య పరిణామాల మధ్య టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇది ఇలా ఉంటే రోజా క్లాస్‌మేట్, సినీనటి మాధవీ రెడ్డి రోజా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాధవీ రెడ్డి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను తిరుపతి బీఎస్సీలో చేరానని, ఆ సమయంలో రోజా తనతో పాటు చదువుకున్నారని మాధవి తెలిపారు.
చదువుకున్న రోజుల్లో రోజా, తను మంచి ఫ్రెండ్స్ అని గుర్తుచేశారు. చదువుకునే రోజుల్లోనే రోజాకు సినిమా ఆఫర్లు వచ్చాయని, ఆమె తొలి చిత్రం ‘ప్రేమ తపస్సు’ చేసేటప్పుడు తాము తిరుపతిలోనే ఉన్నామని మాధవీ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో నువ్వు పనిమనిషి క్యారెక్టర్‌కు బాగా సరిపోతావంటూ ఆమెను వెక్కిరించే వాళ్లమని మాధవీ గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తి కాగానే రోజాను తను కలవలేదు అని చెప్పుకొచ్చారు. కానీ కొన్నాళ్ల తర్వాత రోజా హోస్ట్ చేసిన మోడ్రన్ మహాలక్ష్మి షోలో నేను కూడా పార్టిసిపేట్ చేశానని, నేను మీ డిగ్రీ క్లాస్‌మేట్‌నని గుర్తుచేశానని చెప్పారు. వెంటనే రోజా తనను గుర్తుపట్టి అప్పట్లో నేను చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని కదా అని అన్నారని మాధవీ తెలిపారు. చదువులో రోజా చాలా చురుగ్గా ఉండేవారని చెప్పారు. రోజా వాక్చాతుర్యం, నటనతో పాటు ఇంటెలిజెంట్ అని మాధవీ ప్రశంసించారు. ప్రజెంట్ ఆమె రోజాపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Read More..
AP Politics:వారిపై రోజా వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించిన టీడీపీ..!