గుంటూరులో వీధి పేరు మార్పుపై చెలరేగిన మత ఘర్షణలు..

by sudharani |   ( Updated:2023-05-05 10:25:27.0  )
గుంటూరులో వీధి పేరు మార్పుపై చెలరేగిన మత ఘర్షణలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో వీధి పేర్లు మార్పులు ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. వీధులను ఈజీగా గుర్తించేలా కొన్ని పేర్లను మార్చి బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే వీటిలో కొన్ని వివాదస్పదంగా మారాయి. ఇందులో నగరంలో ఏటి అగ్రహారం ప్రాంతంలో ఆనంద త్రిదండి అగ్రహారంలోని రెండవ లైన్‌కు ఫాతిమా నగర్ అంటూ కార్పొరేషన్ సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేశారు.

దీంతో స్థానికంగా అభ్యంతరాలు వచ్చాయి. AT అగ్రహారానికి ఫాతిమా నగర్ అనే పేరు పెట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫాతిమా నగర్ నేమ్ బోర్డు చించేసి.. AT అగ్రహారం అంటూ స్థానికులు రాశారు. అయితే ఈ పేర్లు మార్పులపై సోషల్ మీడియాలో సైతం వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా.. కొంతమంది రాజకీయ నేతలు వీటిని మత ఘర్షణలకు దారి తీసేలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి

Also Read...

ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ భవన్.. తెలంగాణకు ఆ హౌస్..!

Advertisement

Next Story