మాజీమంత్రి మేకతోటి సుచరిత పోటీపై క్లారిటీ

by Seetharam |
మాజీమంత్రి మేకతోటి సుచరిత పోటీపై క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ హోంశాఖమంత్రి, పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పోటీపై ఎంపీ అయోధ్యరామిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. వచ్చేఎన్నికల్లో మాజీహోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పోటీ చేస్తారని వెల్లడించారు. పత్తిపాడులో వైసీపీని నిర్వీర్యం చేసే విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ పార్టీలో సీఎం జగన్‌కి ఎంత హక్కు ఉందో సుచరితకి అంతే ఉంది అని చెప్పుకొచ్చారు. వైసీపీ పార్టీలో నిర్మాణంలో సుచరిత పాత్ర ఉంది అని అన్నారు. పత్తిపాడులో పార్టీ నిర్వీర్యం చేయడానికి ఎంతో మంది ఏవేవో చేస్తుంటారని వారిని పట్టించుకోవద్దు అని సూచించారు. సుచరిత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పత్తిపాడుకి రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ప్రతి నియోజక వర్గంలో వైసీపీలో అభ్యర్ధులు ఎంపిక విషయంలో హెవీ కాంపిటీషన్ ఉంది అని ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story