- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Viveka Case: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సీజేఐ ఆశ్చర్యం
- బెయిల్ రద్దు చేయడం..మళ్లీ విడుదల చేయడం ఏంటని ప్రశ్న
- విచారణను వెకేషన్ బెంచ్‌కి సీజేఐ ధర్మాసనం బదిలీ
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-1 నిందితుడు అయిన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూన్ 30 వరకు బెయిల్ రద్దు చేసి మళ్లీ జూలై 1న విడుదల చేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవేమి ఉత్తర్వులు అంటూ తలపట్టుకున్నారు. ఈ మేరకు విచారణ వెకేషన్ బెంచ్‌కి సీజేఐ ధర్మాసనం బదిలీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చేవారం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.
కాగా గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చినంత వరకు రిమాండ్‌లో ఉండాలని అనంతరం జూలై 1న మళ్లీ విడుదల చేయాలని ఆదేశించింది. జూలై 1న మళ్లీ బెయిల్‌పై ఎర్ర గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సుప్రీంను వైఎస్ సునీతారెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం విచారించింది. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలున్నాయని...సాక్ష్యులను బెదిరించే అవకాశాలు లేకపోలేదని వైఎస్ సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పిటిషన్‌లో వైఎస్ సునీతారెడ్డి పేర్కొన్నారు.