చంద్రబాబుపై మరో మూడు కేసులు నమోదు చేసేందుకు సీఐడీ రెడీ

by Javid Pasha |   ( Updated:2023-11-04 03:56:03.0  )
చంద్రబాబుపై మరో మూడు కేసులు నమోదు చేసేందుకు సీఐడీ రెడీ
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు నమోదు చేస్తోంది. కేసులతో చంద్రబాబుకు సీఐడీ ఊపిరాడకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఆరు కేసులను చంద్రబాబుపై నమోదు చేయగా.. మరో మూడు కేసులను కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం, కృష్ణా పుష్కర పనుల్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్దమవుతోంది. చంద్రబాబుతో పాటు మరికొంతమంది నేతలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేయనుందని సమాచారం. ఇటీవల ఉచిత ఇసుక విధానంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story