రూ.4400 కోట్ల కుంభకోణం.. ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు

by GSrikanth |   ( Updated:2024-03-11 14:48:46.0  )
రూ.4400 కోట్ల కుంభకోణం.. ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు. చంద్రబాబుపై సీఐడీ చార్జి‌షీట్ దాఖలు చేసింది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో చార్జిషీటు దాఖలు చేయగా.. రూ.4400 కోట్లు భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును చేర్చింది. అంతేకాదు.. మాజీ మంత్రి నారాయణ, తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీకుమార్‌లను ముద్దాయిలుగా పేర్కొంది. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు సీఐడీ తెలిపింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తేల్చింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు 53 రోజుల జైలు జీవితాన్ని గడిపిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ సీఐడీ ప్రధాన ముద్దాయిగా చార్జిషీట్ విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Read More..

ముహూర్తం బాబు డిసైడ్‌ చేస్తారు.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైసీపీకి అదిరే ట్విస్ట్

Advertisement

Next Story

Most Viewed