- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balineni: పార్టీ ధిక్కారానికి పాల్పడితే చర్యలు తప్పవు
దిశ, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ధిక్కారానికి, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని మాజీ మంత్రి, తిరుపతి జిల్లా రీజనల్ కొ ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసుల్ రెడ్డి స్పష్టం చేశారు. ధిక్కార స్వరం మితిమీరితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్థానంలో నియోజకవర్గ కో - ఆర్డినేటర్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం పూర్తి బాధ్యతలు అప్పగించిందని గుర్తు చేశారు. తిరుపతి వేదికగా గురువారం వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ హోదాలో బాలినేని శ్రీనివాసుల్ రెడ్డి, మంత్రి ఆర్.కే. రోజా, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ బల్లి చక్రవర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి(తిరుపతి), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(చంద్రగిరి), బియ్యపు మధుసూదన్ రెడ్డి(శ్రీ కాళహస్తి), కిలివేటి సంజీవయ్య(సూళ్లూరుపేట), కోనేటి ఆదిమూలం(సత్యవేడు), వరప్రసాద్ (గూడూరు)తో పాటు పార్టీ పరిశీలకులు హాజరయ్యారు.
ముందుగా బాలినేని, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, పరిశీలకులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యే అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో ఈ నెల 6న సత్యవేడు, 7న గూడూరు, 8న సూళూరుపేటలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కార్యకర్తలకు అండగా ఉంటామనే భరోసా కల్పించే దిశగా సంకల్పించాలని దిశా నిర్దేశం చేశారు.
అనంతరం మాజీ మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ..
రానున్న ఎన్నికల్లో ఏ ఒక్క స్థానం కోల్పోకుండా క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అన్ని స్థానాల్లో విజయపతాకం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ బలోపేతానికి సంకల్పిస్తామన్నారు. ఎమ్మెల్యేలకు అండగా నియోజకవర్గాలకు పరిశీలకులను నియామకం చేపట్టినట్లు వెల్లడించారు. పార్టీలో సంస్థాగతంగా ఎక్కడ ఏ లోపం ఉన్నా.. వెంటనే వాటిని సరిదిద్దుకోవడానికి పరిశీలకులు కృషి చేస్తారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చేపడుతున్న "గడగడపకు మన ప్రభుత్వం" కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేల గ్రాఫ్ మరింత పెరిగిందన్నారు. ప్రజలతో మమేకమవుతూ.. సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తోందన్నారు. తాను రీజనల్ కో -ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి పార్టీ అధ్యక్షులుతో కలసి ప్రతి నెల సమన్వయ సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గాల్లో పర్యటిస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. సినీ హీరో బాలకృష్ణ చిత్రం షూటింగ్‌కు అనుమతులు నిరాకరించారాన్న మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సినీ కార్యక్రమాలను కూడా తాము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.. ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమాల్లో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో ఒంగోలులో కళాశాల ఆవరణలో కాకుండా దూర ప్రాంతాల్లో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అనుమతులు కూడా ఇచ్చారని తెలియజేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు.
జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
'తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి, తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని చూడాలనే ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే తన విధి' అని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మంత్రులు, రీజినల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు సమన్వయంతో జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తానని పేర్కొన్నారు. కొత్తగా జిల్లా అధ్యక్షుడి బాధ్యతలే కాకుండా వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వెంకటగిరి ప్రజలు వైఎస్సార్సీపీని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి బ్రహ్మరథం పడతారన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి జిల్లా పరిధిలోని నియోజకవర్గాల పరిశీలకులు శైలజ చరణ్ రెడ్డి(చంద్రగిరి), సిహెచ్ సత్యనారాయణ రెడ్డి(వెంకటగిరి), చక్రపాణి రెడ్డి(శ్రీకాళహస్తి), ప్రసాద్ రెడ్డి(తిరుపతి), సుధీర్ రెడ్డి(సూళ్లూరుపేట), దయాసాగర్ రెడ్డి(సత్యవేడు), ముక్కాల ద్వారకనాథ్(గూడూరు) తదితరులు పాల్గొన్నారు