Tirupati: ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు మూడు ఐఎస్‌వో సర్టిఫికెట్లు

by srinivas |
Tirupati: ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు మూడు ఐఎస్‌వో సర్టిఫికెట్లు
X

దిశ, తిరుపతి: వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు మూడు విభాగాల్లో ఐఎస్‌వో సర్టిఫికెట్లు లభించాయి. ఈ సర్టిఫికెట్లను టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ అందుకున్నారు. ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యుత్ పొదుపు చేసినందుకు, కళాశాల ఆవరణంలో పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు సర్టిఫికెట్లు లభించాయి. అలాగే కళాశాల నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు మరో సర్టిఫికెట్ లభించాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఇతర అధ్యాపకులు, సిబ్బందిని ఈవో ధర్మారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఐఎస్‌వో ప్రతినిధులు శివయ్య, మౌళిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్వీబీసీకి ...

వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు ఐ‌ఎస్‌వో సర్టిఫికెట్ లభించింది. ఎస్వీబీసీసీ ఈవో షణ్ముఖ్ కుమార్ ఈవో ధర్మారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed