Tragedy: శుభకార్యక్రమంలో విషాదం.. నలుగురు దుర్మరణం

by srinivas |   ( Updated:2023-08-18 15:29:48.0  )
Tragedy: శుభకార్యక్రమంలో విషాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దతిప్పసముద్రం మండలం కానుగమాకులపల్లెలో గృహ ప్రవేశ వేడుకలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఓ ఇంట్లో గృహప్రవేశానికి వేసిన షామియాన గాలికి ఎగిరి 11కేవీ విద్యుత్ లైన్‌పై పడడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బీ కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెురుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు తరలిస్తుండగా మార్గమద్యలో మరోకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు బి.కొత్తకోట మండలం కొత్తపల్లి కు చెందిన లక్ష్మమ్మ(70) , విజయ్ ప్రశాంత్ (25) , వడిగలవారి పల్లె కు చెందిన లక్ష్మణ (53)లుగా గుర్తించారు. ఆస్పత్రిలోలో చికిత్సపొందుతూ మరో మహిళ మృతి చెందారు. సునీతా (40), సుధాకర్ (48)ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story