- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirumala: తిరుమల నంబికి శాస్త్రోక్తంగా మేల్‌చాట్ శేష వస్త్రం సమర్పణ
దిశ, తిరుమల: తిరుమల నంబికి శాస్త్రోక్తంగా మేల్‌చాట్ శేష వస్త్రాన్ని సమర్పించారు. గత నెల 12వ తేదీ నుంచి జనవరి 5 వరకు వేంకటేశ్వర స్వామి అధ్యయనోత్సవాలు నిర్వహించిన విషయం విధితమే. ఈ అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటిరోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దక్షిణ మాడ వీధిలోని తిరుమల నంబి ఆలయానికి వేంచేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం తిరుమల నంబి శ్రీవారి ఆలయం చెంతకు వేంచేపుగా చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలనంబికి మేల్‌చాట్ శేష వస్త్రాన్ని శాస్త్రోక్తంగా సమర్పించారు. వైష్ణవ భక్తాగ్రేసరుడు వేంకటేశ్వర స్వామి సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడే తిరుమలనంబి. వీరు సాక్షాత్తు భగవత్ రామానుజాచార్యులకి స్వయానా మేనమామ కావడం విశేషం. ఈ కార్యక్రమంలో తిరుమల జీయంగార్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.