Tirumala భక్తులకు మరో సౌకర్యం

by srinivas |   ( Updated:2023-03-08 12:33:13.0  )
Tirumala భక్తులకు మరో సౌకర్యం
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులలో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని, దానికి తగినట్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీ ఆరంభమయ్యే వరకూ శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 90% పనులు చేశారు. మిగిలిన పనులు కూడా మే 15వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయానికి మొత్తం రూ. 680 కోట్లు కేటాయించారు. ఈ ఫ్లై ఓవర్ పనులు పూర్తయితే తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వేరు వేరు కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలుపడ్డాయి. ఈ షెడ్యూల్స్ అన్ని ముగిసిన తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed