- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పులివర్తి నానిపై హత్నాయత్నం.. సిట్ విచారణలో సంచలన విషయాలు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనపై సిట్ విచారణ పూర్తి అయింది. ఎన్నికల పోలింగ్ వేళ తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ఆదివారం విచారణ చేపట్టారు. సిట్ డీఎస్పీ రవి మనోహర్ చారి ఆధ్వర్యంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఎస్వీయూనివర్సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలపై ఆరా తీశారు. పద్మావతి యూనివర్సిటీ వద్ద చెలరేగిన అల్లర్ల వివరాలను సేకరించారు. అల్లర్లపై నమోదు అయిన ఎఫ్ఐఆర్‌ను పరిశీలించారు. పులివర్తి నానిపై జరిగిన దాడి ప్రాంతాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. చంద్రగిరి నియోజకవర్గం కూచువారిపల్లి, రాంరెడ్డిగారిపల్లిలోనూ విచారణ చేపట్టారు.
రాంరెడ్డిగారిపల్లిలో ఓ ఇంటిని కొంతమంది వ్యక్తులు దగ్ధం చేశారు. ఆ ప్రాంతాన్ని సైతం పరిశీలించారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్ మెన్ ఇంటిని సైతం పరిశీలించారు. వివిధ సమయాల్లో జరిగిన ఘటనలపైనా ఆరా తీశారు. స్థానిక సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. నేతలు, పోలీసుల, సీసీ ఫుటేజ్ సమయాల్లో తేడాలున్నట్లు గమనించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇక అల్లర్ల సమయంలో కొందరు సామాన్యులపైనా కేసులు నమోదు చేసినట్లు సిట్ డీఎస్పీ మనోహర్ చారికి స్థానికులు వివరించారు. అయితే వారి కాల్ డేటా ఆధారంగా కేసు విచారణ చేపట్టాలని నిర్ణయించారు.