శ్రీవారికి లెక్క లేనంత ఖజానా.. ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా?

by srinivas |   ( Updated:2024-04-21 09:22:05.0  )
శ్రీవారికి లెక్క లేనంత ఖజానా.. ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆదాయం ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతూ పోతోంది. అటు భక్తులు సైతం భారీగా వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని కానుకులు, విరాళాలు సమర్పిస్తున్నారు. ఇలా ఏడు కొండల వారి ఆదాయం ఏకంగా రూ. 18 వేల కోట్లకు చేరింది. 2023-24లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏకంగా రూ.11 వందల 61 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. ఈ మొత్తంలో డిపాజిట్ చేయడం ఇదే అత్యధికం కావడం విశేషం. టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొత్తంరూ. 18 వేల కోట్లకు చేరినట్లు టీటీడీ ప్రకటించింది. కరోనా కాలంలో కాస్త ఆదాయం తగ్గినా ఆ తరువాత ప్రతి నెలా రూ. 100 కోట్లు ఆదాయం వస్తున్నట్లు స్పష్ట చేసింది. 22023-24లో 1,031 కిలోల బంగారం డిపాజిట్ చేసినట్లు పేర్కొంది. దీంతో మొత్తం శ్రీవారి పేరుపై 11 వేల 329 కేజీల బంగారం ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు ప్రకటించింది. వీటన్నింటిపై ప్రతి ఏటా వడ్డీ రూపంలో రూ.1200 కోట్లు ఆదాయం వస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Read More..

Atrocious: వీడియోలు చూస్తుండగా చేతిలో పేలిన సెల్ ఫోన్.. చిన్నారి పరిస్థితి..!?

Advertisement

Next Story

Most Viewed