తిరుమలలో భారీ కొండచిలువ కలకలం

by srinivas |
తిరుమలలో భారీ కొండచిలువ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలో కొండచిలువ కలకలం రేపింది. శ్రీవారి సదన్ వద్ద కొండచిలువ భక్తుల కంటపడింది. దీంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే టీటీడీ అధికారులకు, స్నేక్ కేచర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన స్నేక్ కేచర్ భాస్కరనాయుడు కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే కొండచిలువ ఆరడుగులకు పైగా ఉంది. స్నేక్ కేచర్ పట్టుకునే సమయంలో కొండచిలువ ఒక్కసారిగా నోరు తెరవడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. ఏదో ఒక జంతువు తరచూ తిరుమలలో సంచరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న పులి, నిన్న ఎలుగుబంటి, నేడు కొండచిలువ కనిపించడంతో భయ బ్రాంతులను వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటనలు గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అడవి జంతువులు తిరుమలలోకి రాకుండా అధికారులు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు.

Advertisement

Next Story