శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

by Jakkula Mamatha |
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
X

దిశ,తిరుమల: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ దంప‌తులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, డైరీ, క్యాలెండ‌ర్‌ను జేఈవో వీర‌బ్ర‌హ్మం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈఓ శ్రీమతి గౌతమి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఆదితి సింగ్, డెప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంధ్ర నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed