తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదు: తెలంగాణ మంత్రి

by Jakkula Mamatha |
తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదు: తెలంగాణ మంత్రి
X

దిశ, తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్యం సమయంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ..తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, కీర్తిని కాపాడుకోవాలన్నారు. తెలుగు ప్రజల కష్టాలు తీర్చే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed